News January 3, 2025
SKLM: క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఆల్ ఆంధ్రప్రదేశ్ క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ శ్రీకాకుళం జిల్లా క్యాలెండర్‌ను జెసీ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ క్యాలెండర్‌ను విడుదల చేసి సభ్యులకు అందజేశారు. అనంతరం వారికి జెసీ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సీహెచ్ ఉమాశంకర్, సెక్రెటరీ పద్మ, రవిశంకర్, సీతారాం, సుబ్రహ్మణ్యం, నాగమణి కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
Similar News
News January 5, 2025
శ్రీకాకుళంలో జనవరి 7న జాబ్ మేళా
శ్రీకాకుళం బలగ ప్రభుత్వ డీఎల్ టీసీ/ ఐటీఐ కాలేజ్‌లో జనవరి 7న ఏపీ నైపుణ్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా అధికారి యు. సాయికుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీల్లో 75 పోస్టులు భర్తీ చేయనున్నారు. SSC, INTER పూర్తిచేసిన 18-35 ఏళ్ల కలిగిన M/F అభ్యర్థులు అర్హులని అన్నారు. ఈ అవకాశం నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
News January 4, 2025
శ్రీకాకుళం: డ్వాక్రా బజార్ సోమవారానికి వాయిదా
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్థానిక మునిసిపల్ మైదానంలో ఆదివారం ప్రారంభించిన డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం వాయిదా వేయటం జరిగిందని డీఆర్డిఏ పీడీ పీ కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కొన్ని సమస్యలు కారణంగా దీనిని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమాన్ని సోమవారానికి మార్చామని, దీనిని గమనించాలని స్పష్టం చేశారు.
News January 4, 2025
SKLM: ‘జనవరి 5 నుంచి సిక్కోలు డ్వాక్రా బజార్’
జిల్లాలో సిక్కోలు డ్వాక్రా బజార్ పేరిట ఈ నెల 5వ తేదీ ఆదివారం 7 రోడ్ల కూడలిలోని మున్సిపల్ మైదానంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్మకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బజార్‌లో చేనేత వస్త్రాలు, హస్తకళలు, చేతి వంటల ఆహార పదార్థాలు తదితర ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.