News January 2, 2025

SKLM: ఖేల్‍రత్న అవార్డు గ్రహీతలకు మంత్రి అభినందన

image

ఖేల్‍రత్న అవార్డు గ్రహీతలను మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి గురువారం ప్రకటన విడుదల చేశారు. షూటింగ్‍లో ఒలింపిక్స్ పతక విజేత మనుబాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‍కు, హాకీ క్రీడాకారుడు హర్మన్‍ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ విభాగంలో ప్రవీణ్‍కుమార్‌లకు ఖేల్‍రత్న అవార్డులు ప్రకటించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ఈ అవార్డులు అందుకోవాలన్నారు.

Similar News

News January 4, 2025

శ్రీకాకుళం: డ్వాక్రా బజార్ సోమవారానికి వాయిదా

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్థానిక మునిసిపల్ మైదానంలో ఆదివారం ప్రారంభించిన డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం వాయిదా వేయటం జరిగిందని డీఆర్డిఏ పీడీ పీ కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కొన్ని సమస్యలు కారణంగా దీనిని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమాన్ని సోమవారానికి మార్చామని, దీనిని గమనించాలని స్పష్టం చేశారు.

News January 4, 2025

SKLM: ‘జనవరి 5 నుంచి సిక్కోలు డ్వాక్రా బజార్‌’

image

జిల్లాలో సిక్కోలు డ్వాక్రా బజార్ పేరిట ఈ నెల 5వ తేదీ ఆదివారం 7 రోడ్ల కూడలిలోని మున్సిపల్ మైదానంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్మకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బజార్‌లో చేనేత వస్త్రాలు, హస్తకళలు, చేతి వంటల ఆహార పదార్థాలు తదితర ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

News January 4, 2025

ఆముదాలవలస: గుండెపోటుతో వైద్యుడు మృతి

image

ఆమదాలవలసకు చెందిన వైద్యుడు పీ.హర్షవర్ధన్(36) అనే వైద్యుడు గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని బీ.ఆర్ నగర్‌కు చెందిన ఈయన శ్రీకాకుళంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్నారు. కాగా గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఈయన గుండెపోటుతో మరణించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైద్యుడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.