News December 21, 2025

SKLM: ‘చిన్నారులకు పోలియో రక్షణ కవచం’

image

జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఎచ్చెర్లలోని పూడివలసలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 1,55,876 మంది చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Similar News

News December 23, 2025

శ్రీకాకళం: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

image

కవిటి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు కర్రి విశ్వనాథం (34) మంగళవారం చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. సముద్రంలో వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు విశ్వనాథం సముద్రంలో పడిపోయే సమయంలో పడవకు ఉన్న ఫ్యాన్ ఆయనకు తగలడంతో ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఈశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 23, 2025

SKLM: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవిబాబు మంగళవారం తెలిపారు. BSE.AP వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు DEO కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్‌లో ఫీజు రూ.100, డ్రాయింగ్ HG ఫీజు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ LG రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ HG రూ.200లు ఈ నెల 27లోపు చెల్లించాలన్నారు.

News December 23, 2025

శ్రీకాకుళం: ఆ రోడ్డుపై బారులు తీరిన టాక్టర్లు ఎందుకంటే?

image

నందిగం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ధాన్యం లోడులతో రైతులు అవస్థలు పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ధాన్యం బస్తాలతో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నందిగం మండలంలో 22 రైతు సేవా కేంద్రాల పరిధిలో ట్రక్ షీట్లు మంజూరు చేస్తుండగా 11 రైస్ మిల్లులో కొనుగోలు ప్రక్రియ జరగాల్సి ఉండగా సోమవారం నాటికి కేవలం 2 మిల్లులకు మాత్రమే బ్యాంకు గ్యారంటీలు ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.