News March 15, 2025
SKLM: జిల్లా అధికారులతో.. కేంద్ర మంత్రి సమీక్ష

శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జడ్పీ సీఈఓ, పీడీ DWMA, ఈఈ పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనుల గురించి ఆయన సమీక్షించారు. పనులు వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News March 14, 2025
శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్ధం శ్రీకాకుళం, పలాస మీదుగా షాలిమార్(SHM), విశాఖపట్నం(VSKP) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 16న VSKP- SHM(నం.08577), 17న SHM- VSKP(నం.08578) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు పలాస, శ్రీకాకుళం రోడ్‌తో పాటు విజయనగరం, కొత్తవలస, చీపురుపల్లితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని ఓ ప్రకటన విడుదల చేశారు.
News March 14, 2025
SKLM: ఈనెల 20న తపాలా అదాలత్

శ్రీకాకుళం: పోస్టల్ సేవలకు సంబంధించి వ్యక్తిగత ఫిర్యాదుల కోసం ఈనెల 20న మధ్యాహ్నం 2 గంటలకు తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీ హరిబాబు శుక్రవారం తెలిపారు. ఫిర్యాదులను నేరుగా లేదా పోస్ట్ ద్వారా జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి ఈనెల 20 లోపు అందే విధంగా పంపించాలన్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించబడవని వివరించారు.
News March 14, 2025
జలుమూరు: విద్యుదాఘాతంతో యువకుడి మృతి

జలుమూరు మండలంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అబ్బాయిపేట గ్రామంలో ఎర్రన్నపేట గ్రామానికి చెందిన బలగ మణికంఠ ఓ వివాహ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ లైట్ల అలంకరణ చేపట్టాడు. ఈ క్రమంలో యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం నరసన్నపేట తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు వివరించారు.