News September 26, 2025
SKLM: ‘జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మారిన జీఎస్టీపై ప్రభుత్వ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. 4 వారాల షెడ్యూల్‌ను సవివరంగా ప్రజలకు తెలియజేయాలన్నారు.
Similar News
News December 9, 2025
శ్రీకాకుళం: ‘లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 47 మందిపై కేసులు నమోదు చేశాం’

శ్రీకాకుళం జిల్లాలో గడచిన 5 సంవత్సరాల్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 47 మందిపై కేసులు నమోదు చేశామని జిల్లా అవినీతి నిరోధక శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ కేసులలో అధికారులు, ఉద్యోగులు ఉండగా వారిలో కొంతమంది జైలుకు వెళ్లగా మరి కొంతమంది కోర్టుల్లో విచారణ ఎదుర్కొంటున్నారన్నారు.
News December 9, 2025
శ్రీకాకుళం: తల్లి మందలించిదని పురుగులమందు తాగి యువతి ఆత్మహత్య

రణస్థలం మండలం ముక్తంపురానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తి (16) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. జే.ఆర్.పురం పోలీసులు వివరాలు మేరకు.. కీర్తి ఈనెల 6న ఇంట్లో TV చూస్తుండగా తన తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన కీర్తి పురుగులమందు తాగింది. దీంతో ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
News December 9, 2025
శ్రీకాకుళం: రేపటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీటి కోసం జిల్లాలో నాలుగు కేంద్రాలను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఎచ్చెర్లలో శివాని, వెంకటేశ్వర కళాశాలలు, నరసన్నపేటలో కోర్ టెక్నాలజీ, టెక్కలి ఐతమ్‌లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.


