News February 25, 2026

SKLM: ‘డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి’

image

డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.

Similar News

News February 28, 2026

శ్రీకాకుళం: ఆ మారణహోమం జరిగి నేటికి 15 ఏళ్లు పూర్తి

image

సంతబొమ్మాళి(M) కాకరపల్లి థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాటయోధులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఈస్ట్ కోస్ట్ సంస్థ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ 2011 ఫిబ్రవరి 28వ తేదీన స్థానికులు ఆందోళన చేపట్టారు. వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పర్యావరణ శాఖ ఈ ప్లాంట్‌ నిర్మాణాన్ని రద్దు చేసింది.

News February 28, 2026

శ్రీకాకుళం: ‘ఏపీ గురుకులాల్లో ప్రవేశాలు’

image

ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని DEO రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అడ్మిషన్ నోటిఫికేషన్ పోస్టర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో యూనిట్‌గా 5, 6, 7, 8వ తరగతులు, ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 18 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం కాగా, మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 28, 2026

అతిసారం అదుపులోనే ఉంది: శ్రీకాకుళం కలెక్టర్

image

అతిసారం పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 162 కేసులు నమోదు కాగా 47మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 112 మంది చికిత్స పొందుతున్నారు.