News March 4, 2025
SKLM: నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయండి

నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో నిర్వహించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లిన సెక్రటేరియట్ సిబ్బంది సెలవులను సంబంధిత జిల్లా అధికారులు రెగ్యులరైజ్ చేయరాదన్నారు.
Similar News
News March 4, 2025
SKLM: కంటి వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

గ్రామ స్థాయిలో కంటి వ్యాధులపై ఆప్తాల్మీక్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య DM&HO టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా DM&HO కార్యాలయంలో ఆప్తాల్మిక్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ప్రతి ఒక్క ఆప్తాలమిక్ అధికారి వారి పరిధిలో ఎన్జీవో ఆసుపత్రి వారు నిర్వహించే క్యాటరాక్ట్ క్యాంపులను సందర్శించి అంధత్వంతో బాధపడుతున్న వారికి రిఫర్ చేయాలన్నారు.
News March 4, 2025
టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

టెక్కలి పోలీస్ స్టేషన్‌లో సోమవారం జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా తొలుత స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. నూతన మోటార్ వెహికల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సిబ్బందికి చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
News March 3, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు 337 మంది డుమ్మా

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 74 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా.. సోమవారం జరిగిన తెలుగు/ సంస్కృతం పరీక్షకు 337 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 18,782 మంది హాజరు కావాల్సి ఉండగా.. 18,445 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు.