News March 5, 2025
SKLM: నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయండి

నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో నిర్వహించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లిన సెక్రటేరియట్ సిబ్బంది సెలవులను సంబంధిత జిల్లా అధికారులు రెగ్యులరైజ్ చేయరాదన్నారు.
Similar News
News March 5, 2025
దువ్వాడ అనుచిత వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఫిర్యాదు

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలపై జనసేన నాయకులు మంగళవారం కరప పోలీస్ స్టేషన్‌లో ఎస్సై టి.సునీతకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కరప జనసేన నేతలు భోగిరెడ్డి కొండబాబు, భోగిరెడ్డి గంగాధర్, నున్న గణేష్ నాయుడు, పప్పులు మల్లి బాబు, గోన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
News March 4, 2025
SKLM: నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయండి

నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో నిర్వహించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లిన సెక్రటేరియట్ సిబ్బంది సెలవులను సంబంధిత జిల్లా అధికారులు రెగ్యులరైజ్ చేయరాదన్నారు.
News March 4, 2025
SKLM: కంటి వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

గ్రామ స్థాయిలో కంటి వ్యాధులపై ఆప్తాల్మీక్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య DM&HO టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా DM&HO కార్యాలయంలో ఆప్తాల్మిక్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ప్రతి ఒక్క ఆప్తాలమిక్ అధికారి వారి పరిధిలో ఎన్జీవో ఆసుపత్రి వారు నిర్వహించే క్యాటరాక్ట్ క్యాంపులను సందర్శించి అంధత్వంతో బాధపడుతున్న వారికి రిఫర్ చేయాలన్నారు.