News December 27, 2024
SKLM: నెమలి పింఛంపై కనకమహాలక్ష్మి దేవి చిత్రం

శ్రీకాకుళం నగరానికి చెందిన వాడాడ రాహుల్ పట్నాయక్ శుక్రవారం నెమలి పింఛంపై వేసిన కనకమహాలక్ష్మీ దేవి చిత్రం ఆకట్టుకుంది. రాహుల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చిత్రాలకు ఎన్నో పురస్కారాలు పొందారు. పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ రాసలీల తదితర దేవతల చిత్రాలు వేశారు. పాఠశాలల గోడలపై ఎన్నో విద్యా సంబంధిత బొమ్మలు వేసి పలువురు ప్రశంసలు పొందారు.
Similar News
News November 9, 2025
SKLM: ‘ఈనెల 11న జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు’

జాతీయ విద్య దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం కలెక్టర్ సమావేశ మందిరంలో ఈనెల 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి, ‘భారత రత్న’ జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని జరపనున్న కార్యక్రమంలో అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
News November 9, 2025
మాంగోలియా జైల్లో ఇరుక్కున్న సిక్కోలు వాసి

ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లిన ఓ శ్రీకాకుళం జిల్లా వ్యక్తి అక్కడి జైల్లో ఇరుక్కున్నాడు. సంతబొమ్మాళి(M) లక్కీవలస పంచాయతీ పిట్టవానిపేటకు చెందిన తూలు గారయ్య 5నెలల అగ్రిమెంట్తో పెయింటింగ్ పనులకు వెళ్లాడు. ఈనెల 7న ఇండియాకు వస్తానంటూ అక్కడి ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసిన తన భర్త ఇప్పటి వరకు రాలేదని భార్య తూలు ఎర్రమ్మ వాపోయారు. ప్రభుత్వం సాయం చేయాలని ఆమె కోరుతున్నాడు.
News November 9, 2025
శ్రీకాకుళం: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

ఏటా కార్తీక మాసం 3వ సోమవారం సెలవు ఇస్తారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(DTF) శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసన్న, కృష్ణారావు చెప్పారు. కానీ రేపటి నుంచి జిల్లాలో అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు స్థానిక సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారిద్దరూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.


