News January 30, 2025

SKLM: నేటి నుంచి ఫస్ట్ సెమిస్టర్ పేపర్ల వాల్యుయేషన్

image

శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)కు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి మొదటి సెమిస్టర్ పేపర్స్ వచ్చాయని “మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) నేటి నుంచి ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎకనామిక్స్ మొదలైన పేపర్స్ వచ్చాయన్నారు.

Similar News

News November 4, 2025

ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: మంత్రి అచ్చెన్న

image

శ్రీకాకుళం జిల్లాలో మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళిలోని నిమ్మాడ క్యాంప్ కార్యాల‌యంలో పలు శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలగాలన్నారు.

News November 4, 2025

శ్రీకాకుళం: ఆమె నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళంలోని అరసవల్లికి చెందిన మాడుగుల. ఇందిరా (36) ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, చిన్ని కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

News November 4, 2025

మెళియాపుట్టి: ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా..!

image

ప్రతిరోజూ ఏదోక చోట బస్సు ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ కొందరి వైఖరిలో మార్పులు రావడం లేదు. ఈ నేపథ్యంలో మెళియాపుట్టి (M) గొప్పిలిలో ప్రయాణికులు ఫుట్ బోర్డుపై వేలాడుతూ వెళ్తున్న దృశ్యం నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లు కనిపిస్తోంది. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోక ముందే అధికారులు తనిఖీలు చేపట్టి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.