News March 10, 2025

SKLM: పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి-కలెక్టర్

image

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను సత్వరమే మంజూరు చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జూమ్ ద్వారా సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కలెక్టర్ జిల్లాలోని ఆయా ఉన్నతాధికారులతో కలిసి చర్చించారు.

Similar News

News September 13, 2025

శ్రీకూర్మనాథ క్షేత్రం పాలకమండలి నియామకం

image

గార(M) శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రానికి పాలకవర్గ సభ్యులును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా(వంశపారంపర్య ధర్మకర్త) గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు వ్వవహరిస్తారు. తొమ్మిది మంది సభ్యులుగా సంయుక్త, కుసుమకుమారి, పెంటయ్య, శ్రీనివాసరావు, మునీక, శ్వేతబిందు, సూరిబాబు, కళ్యాణచక్రవర్తి, లక్ష్మిలను నియమించింది. అఫీషియో మెంబర్‌గా సీతారామనృసింహులు ఎన్నికయ్యారు.

News September 13, 2025

శ్రీకాకుళం: ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దు

image

రైతులు ఎరువులకు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రైతులను భరోసా కల్పించారు. శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు పలువురు రైతులు తమకున్న ఎరువుల సమస్యలను ఫోన్‌లో కలెక్టర్‌కు వివరించారు. సంతబొమ్మాళి మండలం మేఘవరం గ్రామానికి చెందిన ఎల్.సోమేశ్వరరావు, శ్రీముఖలింగం గ్రామానికి చెందిన రాజశేఖర్ నాయుడు, SM పురానికి చెందిన ఈశ్వరరావుతో పాటు పలు రైతులు సమస్యలను తెలియజేశారు.

News September 12, 2025

కోటబొమ్మాళి: విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతి

image

కోటబొమ్మాళి మండలం కిష్టపురానికి చెందిన జూనియర్ లైన్‌మెన్ సురేష్ (32) విద్యుత్ షాక్‌కు గురై శుక్రవారం మృతి చెందారు. స్థానిక ఏఈ ఆధ్వర్యంలో కిష్టపురంలో సూరేశ్ మరి కొంతమందితో కలిసి 33KV విద్యుత్ లైన్ల మర్మతులు చేస్తున్నాడు. కరెంటు వైర్లకు చెట్టు అడ్డు రావడంతో కత్తితో తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.