News September 13, 2024

SKLM: పారదర్శకంగా గ్రామ, వార్డు మహిళా పోలీసులు బదిలీలు

image

సాధారణ బదిలీలో భాగంగా జిల్లాలో వివిధ సచివాలయల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి బదిలీలు నిర్వహించారు. మొత్తం 238 మంది మహిళా పోలీసులు ఆన్‌లైన్‌లో బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా 71 మందికి బదిలీలు చేయగా 149 మంది యథావిధిగా వారి స్థానాల్లో కొనసాగడానికి అంగీకారం తెలపగా,18 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

Similar News

News March 6, 2026

కోరాడ కాలనీలో పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

హిరమండలం మండలం కోరాడ కాలనీ జిల్లా పరిషత్  ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. స్కూల్ అభివృద్ధికి రూ. 2,00,000లను, సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 25వేల నిధులను మంజూరు చేశారు.
శుభలయ ఆర్‌ఆర్కాలనీ వాటర్ ట్యాంక్ మెట్ల నిర్మాణానికి రూ.50వేల నిధులు మంజూరు చేశారు. జడ్పీటీసీ బుచ్చిబాబు ఉన్నారు.

News March 6, 2026

SKLM: టెన్త్ విద్యార్థుల్లారా.. మీ ఫోన్‌కే హాల్ టికెట్

image

ఈనెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ హాల్ టికెట్‌లను ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ ఫోన్ నంబర్ 9552300009లో ఎడ్యుకేషన్ సర్వీస్ ఎంపిక చేసి ‘హాయ్’ అని మెసేజ్ చేసి తగు వివరాలు ఎంటర్ చేస్తే హాల్ టికెట్ వస్తుంది. జిల్లాలో 3014 స్కూల్స్ నుంచి 29,398 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు.

News March 6, 2026

శ్రీకాకుళంలో ఆ అద్భుత ఘట్టానికి వేళాయే

image

శ్రీకాకుళం ప్రత్యక్షదైవం ఆరోగ్యప్రదాత అరసవల్లి ఆదిత్యుని మూలవిరాటుపై తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుత ఘట్టం ఈ నెల 9, 10 తేదీల్లో ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ, ఆలయ ఈవో K.N.V.D.V ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ఆదిత్యుని పాదాలపై నేరుగా తొలి సూర్యకిరణాలు తాకనున్నాయి.