News October 7, 2025

SKLM: పిడుగుపాటుతో ముగ్గురు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి

image

మెలియాపుట్టి మండలం గంగరాజపురం క్వారీ వద్ద పిడుగుపాటుతో ముగ్గురు కూలీలు మృతి చెందడం పట్ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పిడుగుపాటుతో మృతి చెందడం చాలా దురదృష్టకరమన్నారు. అస్వస్థతకు గురై టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.

Similar News

News October 7, 2025

మెళియాపుట్టి: పిడుగుపాటు ఘటనలో మృతులు వీరే

image

మెలియాపుట్టి మండలంలోని జంగాలపాడు గ్రానైట్ క్వారీ వద్ద మంగళవారం పిడుగుపాటుకు గురై మృతిచెందిన కార్మికుల వివరాలు ఇలా ఉన్నాయి. జ్ఞానేశ్వర్(రాజస్థాన్), పింటు(మధ్యప్రదేశ్), కుమార్(క్వారీ మేనేజరు,బీహార్) ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. వీరు గత కొన్నాళ్లుగా క్వారీలో కార్మికులుగా ఉన్నారు.

News October 7, 2025

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో మంత్రులు

image

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరలో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనార్థం భారీగా తరలి వచ్చి ఆలయ ప్రాంగణంలో బారులు తీశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గొండు శంకర్, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, అతిథి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

News October 7, 2025

కుమారుడు వేదనను కలెక్టర్‌కు చెప్పుకున్న తల్లి

image

సోమవారం శ్రీకాకుళంలోని పీజీఆర్‌ఎస్‌కు కనుగులువానిపేటకు చెందిన సోనియా అచేతనంగా ఉన్న నాలుగేళ్ల కూమారిడితో వచ్చింది. ఆ బాలుడు పడుతున్న వేదనను కలెక్టర్‌కు చెప్పుకుంది. రేండేళ్లకే పిట్స్ వచ్చి ఎదుగుదల లేక మంచానికే పరిమితమయ్యాడని, దివ్యాంగ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసి బెడ్ రెస్ట్ పింఛన్ రూ.15,000 ఇవ్వాలని కోరింది. తల్లి ఒడిలో చైతన్యం లేకుండా ఉన్న బాలుడ్ని చూసిన అర్జీదారుల మనస్సు కలవరానికి గురిచేసింది.