News November 20, 2024
SKLM: ‘పీ.ఎం సూర్య ఘర్ లక్ష్యాలను అధిగమించాలి’
పీ.ఎం సూర్య ఘర్ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో అధిగమించాలని, పీ.ఎం సూర్య ఘర్ పై అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పంచాయతీ సెక్రటరీలు భాద్యత వహించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ మందిరంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. పంచాయతి సెక్రటరీ, ట్రాన్స్‌కో సమన్వయంతో పనులు వేగవంతం చేసి ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2024
శ్రీకాకుళం జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటుకు వినతి.. మంత్రి ఏమన్నారంటే?
ఎచ్చెర్లలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈశ్వరరావు కోరారు. విశాఖకే కాకుండా ఐటీ పార్క్‌ను వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు సైతం విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఎచ్చెర్లకు దగ్గరలో అంతర్జాతీయ విమానశ్రయం, హైవే కనెక్టివిటీ, విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. టైర్2, టైర్ 3 సిటీల్లోనూ ఎకో వర్కింగ్ స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
News November 21, 2024
నేడు పలాస రానున్న ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు
పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. వజ్రకొత్తూరు, మందస మండలాల పరిధిలో సుమారు 1,353 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. నేడు ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు రానున్నారు.
News November 21, 2024
ఒక ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్ రూ.2.04 లక్షలా: ఎమ్మెల్యే కూన
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్‌ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘గోద్రేజ్ కంపెనీ నుంచి కొనుగోలు చేయకుండా పక్కన పెట్టారు. ఇతర రాష్ట్రాల వారు రూ.1.30 లక్షలకే కొన్న రిఫ్రిజిరేటర్లను వైసీపీ వాళ్లు ఏకంగా రూ.2.04 లక్షలతో కొనుగోలు చేశారు. ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి. వీటిపై విచారణ చేపట్టాలి’ అని ఆయన కోరారు.