News January 25, 2025

SKLM: పురుగు మందు తాగి తల్లీ కూతురు మృతి

image

జలుమూరు మండలం శ్రీముఖలింగానికి చెందిన మహిళ మాధవి (25) తన ఇద్దరు కుమార్తెలతో పాటు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల వివరాల మేరకు.. విశాఖపట్నంలోని తగరపువలస ఆదర్శ నగర్‌లో నివాసముంటున్న రామకృష్ణ, మాధవి దంపతుల మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన మాధవి శనివారం కుమార్తెలకు పురుగుమందు తాగించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో మాధవి, చిన్న కుమార్తె రతిక్ష మృతి చెందారు.

Similar News

News September 14, 2025

రామ్మోహన్‌ను కలిసిన అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్టార్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఎచ్చెర్ల నూతన రిజిస్టార్‌గా నియమితులైన ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాన్ని అందించారు. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు వైస్ ఛాన్స్‌లర్‌కు ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

News September 14, 2025

శ్రీకాకుళం: పండగల వేళ స్పెషల్ ట్రైన్స్

image

దసరా, దీపావళి సందర్భంగా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా చెన్నై సెంట్రల్(MAS), బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06039 MAS- BJU ట్రైన్‌ను నేటి నుంచి NOV 30 వరకు ప్రతి ఆదివారం, నం.06040 BJU- MAS ట్రైన్‌ను SEPT 17 నుంచి DEC 3 వరకు ప్రతి బుధవారం నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో రాజమండ్రి, ఏలూరు, విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News September 14, 2025

శ్రీకాకుళం డీఈఓగా రవిబాబు

image

శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారిగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శనివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. DEO కార్యాలయంలో ADగా పనిచేస్తున్న రవిబాబును ఇప్పటివరకు ఇన్‌ఛార్జి DEOగా కొనసాగారు. జిల్లాలో విద్యా శాఖ అభివృద్ధికి అధికారుల సహాయంతో ముందడుగు వేస్తానని ఆయన అన్నారు.