News November 25, 2025

SKLM: మృత్యువుగా మారిన 3 చక్రాల బండి

image

మందస మండలం వీజీపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సింహాచలం (43) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సింహాచలం 3 చక్రాల స్కూటీపై జాతీయరహదారిపై ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు అది బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108లో హరిపురం సీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మందస పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 23, 2026

శ్రీకాకుళం: ‘ఇంటర్ పరీక్షకు 662 మంది డుమ్మా’

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 662 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 71 కేంద్రాల్లో 20,377 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 19,715 మంది హాజరైనట్లు తెలిపారు. 96.75 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరుగినట్లు, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదన్నారు.

News February 23, 2026

ఎర్రన్నాయుడు నాకు అత్యంత ఆప్తుడు: సీఎం చంద్రబాబు

image

కింజరాపు ఎర్రన్నాయుడు తనకు అత్యంత ఆప్తుడు అని సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం Xలో పోస్ట్ చేశారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని నివాళులు అర్పించారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఎర్రన్న చివరి క్షణం వరకు ప్రజా సేవలో ఉన్నారని చంద్రబాబు కొనియాడారు.

News February 23, 2026

SKLM: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

శ్రీకాకుళం ప్రభుత్వ ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆయన సంబంధిత గదులకు వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం వైద్య సదుపాయం పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడరాదని సూచించారు. పోలీస్ అధికారులు ఉన్నారు.