News April 8, 2025
SKLM: మే 10న జాతీయ లోక్ అదాలత్

ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాబోయే మే 10న జిల్లా స్థాయిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనునట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 17, 2025
శ్రీకాకుళంలో జాబ్ మేళా

శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం 9.30 నుంచి మినీ జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని ప్రిన్సిపల్ p. సురేఖ తెలిపారు. సుమారు 20 కార్పొరేట్ సంస్థలు పాల్గొంటాయని చెప్పారు.
News April 17, 2025
శ్రీకాకుళం DMHO, సీసీ సస్పెండ్

శ్రీకాకుళం డీఎంహెచ్ఓ టి. బాల మురళీకృష్ణ, సీసీ వాన సురేశ్ కుమార్‌లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల మూడో తేదీన ఏసీబీ దాడుల్లో వీరు పట్టుబడ్డారు. దీంతో విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈనెల 17 వరకు రిమాండ్ విధించారు. దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించటంతో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. వీరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
News April 17, 2025
టెక్కలిలో ఓ వ్యక్తి సూసైడ్

టెక్కలి ఎన్టీఆర్ కాలనీ 7వ లైన్‌లో నివాసముంటున్న ముడిదాన కేశవరావు(38) అనే వ్యక్తి బుధవారం రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. నందిగాం మండలం హుకుంపేటకు చెందిన ఈయన టెక్కలిలో ఉంటున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య కొన్నేళ్ల క్రితం మృతిచెందగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని టెక్కలి పోలీసులు పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.