News September 6, 2025

SKLM: రేపు అటవీశాఖ ఉద్యోగ పరీక్ష

image

అటవీ శాఖలో పలు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు SKLM రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదివారం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. జిల్లాలో 10 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరిక్షలకు తగ్గా ఏర్పాట్లు చేశామన్నారు.

Similar News

News September 6, 2025

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణికి కవలలు జననం

image

కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇచ్ఛాపురానికి చెందిన గర్భిణి భూలక్ష్మి శుక్రవారం ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. మార్గం మధ్యలో పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త జానకిరామ్ RPF సిబ్బందికి సమాచారం అందించారు. రైలును శ్రీకాకుళం స్టేషన్ వద్ద నిలిపి డాక్టర్‌ను పిలిపించారు. గర్భిణి రైలులో రైలులో ఆడ శిశువు, ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చిది. తల్లి, శిశువులను ఆసుపత్రికి తరలించారు.

News September 6, 2025

ఆముదాలవలస: అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య

image

అప్పుల బాధలు తాళలేక ఆముదాలవలసకు చెందిన చిరు వ్యాపారి బరాటం తాతయ్య (57) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. తాతయ్య 3 రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతను ఇంటికి రాకపోవడంతో సోషల్ మీడియాలో ఆచూకీ కోసం ప్రకటించారు. పట్టణంలోని పెద్ద చెరువు స్మశాన వాటిక వద్ద శుక్రవారం విగత జీవిగా పడిఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 6, 2025

శ్రీకాకుళం: ప్రయాణికులకు అలర్ట్

image

పెందుర్తి – సింహాచలం లైన్ మధ్య జరిగే సాంకేతిక పనులు కారణంగా నేటి నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈనెల 6, 8, 10, 12వ తేదీల్లో విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18526) & 7, 9, 11, 13వ తేదీల్లో బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (19525)ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.