News November 21, 2024

SKLM: రేపు ప్రజా ఫిర్యాదులు స్వీకరణ రద్దు: ఎస్పీ

image

కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదులు స్వీకరణ పరిష్కార కార్యక్రమం రేపు (శుక్రవారం) కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వలన నిర్వహించడం లేదని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిసర ప్రాంత ప్రజలు పై విషయాన్ని గమనించి ప్రజా ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమానికి కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు రావద్దని ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News November 21, 2024

పీయూసీ కమిటీలో కూన రవికుమార్‌కు ఛాన్స్..!

image

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పీయూసీ ఛైర్మన్‌గా ఎన్నికైయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారని పేరుంది. 2024 ఎన్నికల్లో కూన రవికుమార్ తమ్మినేని సీతారాం పైన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో ఛైర్మన్‌గా పేరు ప్రతిపాదనలో నిలిచింది. రేపు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ ఎన్నిక జరగనుంది.

News November 21, 2024

SKLM: గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించాలి

image

ప్రణాళికాబద్ధంగా జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గృహ నిర్మాణశాఖ అధికారులకు స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, ప్రగతిపై కలెక్టరేట్‌లో గురువారం సమావేశంలో నిర్వహించారు. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలో 100 రోజుల వ్యవధిలో 5 వేల గృహాలు, ఏడాదిలోపు 35 వేల గృహాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.

News November 21, 2024

గార: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూటీ.. ఒకరు మృతి 

image

గార మండలం వమరవిల్లి ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాన్ని స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలకు వెళితే స్థానిక మండలం తోనంగి గ్రామానికి చెందిన కృష్ణారావు, గణేశ్ గురువారం మధ్యాహ్నం స్కూటీతో అతివేగంతో వెళుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ తాకిడికి విద్యుత్ స్తంభం నేలకు ఒరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందాడు.