News February 6, 2026
SKLM: వందల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృతి..అడ్డుకట్టకు అధికారుల చర్యలు

శ్రీకాకుళం జిల్లాకు 193 కి.మీల సముద్ర తీరం ఎచ్చెర్ల-ఇచ్ఛాపురం వరకు వ్యాపించి ఉంది. తీరాల్లో వందల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృతి ఆందోళన కలిగిస్తోంది. జాలర్లు వాడుతున్న స్కిడ్, నానాజాతి, గిల్లెట్, టేకు వలలతో పాటు మెకనైజ్డ్ బోట్లే తాబేళ్ల మృత్యువాతకు కారణమని ఆ శాఖాధికారులు నిర్ధారించారు. వీటి మృతికి అడ్డుకట్ట వేసేందుకు మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని ఆ శాఖ ఏడీ సత్యనారాయణ అన్నారు.
Similar News
News February 17, 2026
శ్రీకాకుళం: బాలికతో అసభ్య ప్రవర్తన.. ఏడాది జైల్లోనే

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జిల్లా పోక్సో కోర్టు న్యాయాధికారి ఎన్.సునీత తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మందస(M) ఓ గ్రామానికి చెందిన బాలికను అదే మండలానికి చెందిన కొర్రాయి తిరుపతి రెండేళ్లుగా వెంటపడుతూ, బాలిక పాఠశాల నుండి వస్తున్నప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లితండ్రులు ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదయినట్లు చెప్పారు.
News February 17, 2026
జేఈఈ మెయిన్స్ పరీక్షలో సత్తా చాటిన సిక్కోలు విద్యార్థి

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి మెట్ట వెంకట సాయి సరాగ్ సత్తా చాటాడు. 99.59 పర్సంటేజ్‌తో ప్రతిభ కనబరిచాడు. మెరిట్ సాధించిన విద్యార్థుల కు జాతీయ స్థాయి ఇంజినీరింగ్ విద్యా సంస్థలైన ట్రిబుల్ ఐటీ, నిట్, జీఎఫ్‌ఐటీలలో ప్రవేశం లభిస్తుంది. దీంతో పాటు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.
News February 17, 2026
శ్రీకాకుళం: చలిలో ఎలా పడుకుంటున్నారో పాపం

శ్రీకాకుళంలోని నాగావళి నది బ్రిడ్జిపై కనిపిస్తున్న ఈ దృశ్యం అభాగ్యుల దీనస్థితిని కళ్లకు కడుతోంది. ప్రస్తుతం ఉన్న చలికి ఇంట్లో ఫ్యాన్ ఆన్ చేస్తేనే వణికిపోతున్నాం. అలాంటిది కొన్ని రోజులుగా మంచు వర్షంలా కురుస్తున్నా ఇలా వరుసగా ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్నారు. ఆ మంచుకి రగ్గులు కూడా తడిసిపోతున్నాయి. వెన్ను వణికించే చలిలో పాపం ఎలా పడుకుంటున్నారో అని ప్రయాణికులు జాలి పడుతున్నారు.


