News December 28, 2025

SKLM: ‘విధుల్లో మరింత ప్రగతి సాధించాలి’

image

పోలీస్ అధికారులు విధుల్లో మరింత ప్రగతి సాధించాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో ముఖ్యమైన కేసులు, ప్రాపర్టీ నేరాల చేదన, ముద్దాయిల అరెస్టు, నిందితులకు శిక్షలుపడే విధంగా చేసిన కృషి, లోక్ అదాలత్ కేసులు పరిష్కారం వంటి అంశాల్లో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన అధికారులనకు సర్టిఫికెట్లు ఇచ్చి అభినందించారు.

Similar News

News January 7, 2026

శ్రీకాకుళం: యువకుడిపై పోక్సో కేసు.. రిమాండ్

image

శ్రీకాకుళం నగరానికి చెందిన నవీన్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శ్రీకాకుళం 1 టౌన్ ఎస్ఐ హరికృష్ణ మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News January 7, 2026

ఆగని భోగాపురం మంటలు.. మీ కామెంట్

image

భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ విషయంలో TDP, YCP నేతల మధ్య మాటల మంటలు ఆరడం లేదు. తమ ప్రభుత్వంలో విమానాశ్రయానికి పూర్తి అనుమతులు తెచ్చామని YCP నేతలు గట్టిగా చెప్తున్నారు. YCP హయాంలోనే 2,200 ఎకరాల్లోని అడ్డంకులు తొలగించి ప్రాజెక్టును పట్టాలెక్కించామంటున్నారు. ఈ వ్యాఖ్యలను TDP కొట్టిపారేస్తోంది. ఎర్ర బస్సు రాని గ్రామానికి ఎయిర్ బస్ తీసుకువచ్చిన ఘనత తమదని, ప్రాజెక్టును పూర్తి చేశామని అంటోంది.

News January 7, 2026

8న అరసవల్లిలో కర్టెన్ రైజర్

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులుతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 9న ఉదయం 8గంటలకు కర్టెన్ రైజర్‌తో వేడుకలకు అంకురార్పణ చేస్తామన్నారు.