News April 2, 2025
SKLM: వివరాలు తెలిపిన వ్యక్తికి బహుమతి

జలుమూరు మండలంలో మార్చి 29వ తేదీ రాత్రి వివిధ ఆలయాల గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాతలు రాశారు. ఈ మేరకు స్పందించిన ఎస్పీ, రాతలకు సంబంధించిన వ్యక్తుల వివరాలు తెలియజేసిన వారికి రూ. 25వేల నగదు పురస్కారం బహుమతిగా ఇస్తామని మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు తెలియజేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.
Similar News
News April 3, 2025
శ్రీకాకుళం: పోలీసులకు చిక్కిన ప్రేమోన్మాది నవీన్

విశాఖపట్నంలోని మధురవాడలో బుధవారం నవీన్ అనే ప్రేమోన్మాది దీపిక, ఆమె తల్లి లక్ష్మిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. పారిపోతున్న నిందితుడు నవీన్‌ను SKLM జిల్లా బూర్జలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత స్పందించారు. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి విశాఖకు తరలించారు.
News April 2, 2025
సోంపేట: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డి హరినాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగనట్లు ఆయన చెప్పారు. ఆమె వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందన్నారు. వివరాలు తెలిస్తే ఈ నంబర్‌ను 9989136143 సంప్రదించాలని ఆయన చెప్పారు.
News April 2, 2025
మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటాం: అచ్చెన్న

వేటకెళ్లి మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేటకెళ్లిన బుంగ ధనరాజు, వంక కృష్ణ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, మత్స్య శాఖల నుంచి వేరువేరుగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చెరో రూ. పది లక్షలను ఆ కుటుంబాలకు త్వరలో అందజేస్తామన్నారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.