News December 12, 2025

SKLM: ‘వీఈఆర్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి’

image

విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఇఆర్)లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు ప్రతిపాదించిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టర్ మందిరంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ఏఏ ప్రాజెక్టులకు ఏ దశలో ఉన్నాయో, వాటికి సంబంధించి భూసేకరణ, మౌలిక వసతులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 12, 2025

శ్రీకాకుళం జిల్లాలో తెరుచుకోని అంగన్వాడీ కేంద్రాలు

image

శ్రీకాకుళం జిల్లాలోని 3,385 అంగన్వాడీ కేంద్రాలు శుక్రవారం తెరుచుకోలేదు. తమ సమస్యలు పరిష్కారానికి అంగన్వాడీ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడంతో సిబ్బంది విధులను బహిష్కరించారు. ప్రధానంగా కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు అమలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, FRS రద్దు తదితర ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కోరుతూ ధర్నాలో పాల్గొనున్నారు.

News December 12, 2025

ఎచ్చెర్ల: యూనివర్సిటీలో జాతీయ సదస్సు

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈనెల 18, 19 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బి.ఆర్.ఏ.యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య గురువారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. భారతదేశంలో విజ్ఞాన సమపార్జన, సంస్కృతి అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తామన్నారు. విద్యారంగ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని చెప్పారు.

News December 12, 2025

SKLM: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

image

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి గురువారం ప్రకటనలో తెలిపారు.ఇంధన పొదుపు ఆవశ్యకతను వినియోగదారులకు మరింత తెలిసేలా అవగాహన కల్పించేలా నిర్వహిస్తామన్నారు. ఈ వారోత్సవాలను శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ కేంద్రాల్లో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.