News January 31, 2025
SKLM: వేడుకకు ప్రజలు సహకరించాలి: ఏఎస్పీ

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి భక్తులందరూ సహకరించాలని ఏఎస్పీ రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న ట్రాఫిక్ మళ్లింపు చర్యలు ప్రతి ఒక్కరు విధిగా పాటిస్తూ నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు.
Similar News
News November 1, 2025
రెయిలింగ్ ఊడిపడటంతో తొక్కిసలాట: హోం మంత్రి

కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని హోం మంత్రి ఆదేశించారు. ఆలయానికి ప్రతి శనివారం 1500 నుంచి 2 వేల మంది వస్తుంటారని చెప్పారు. ఆలయంలో మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా రెయిలింగ్ ఊడిపడటంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని చెప్పారు.
News November 1, 2025
కాశీబుగ్గ ఘటనాస్థలికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీ

కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి తొక్కిసలాటకు కారణాలపై స్థానికులను, భక్తులతో ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటనలో మృతులు, క్షతగాత్రుల వివరాలు, ఆస్పత్రిలో చికిత్స అందుతున్న పరిస్థితిపై పర్యవేక్షించారు. వీరితో పాటు పలువురు జిల్లా అధికారులు ఉన్నారు.
News November 1, 2025
కాశీబుగ్గ ప్రమాదంపై శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం

కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 10 మంది వరకు చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. ప్రమాదంపై సమాచారం కొరకు 08942 240557 కంట్రోల్ రూం నంబర్‌ను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.


