News January 29, 2025

SKLM: శ‌క‌టాల మూడో స్థానంలో నిల‌వ‌డం ఆనందంగా ఉంది: మంత్రి

image

డీల్లీలో ఈ నెల‌ 26న జ‌రిగిన రిపబ్లిక్ డే ప‌రేడ్‌లో ఏపీ ప్ర‌భుత్వం త‌రుపున ప్ర‌ద‌ర్శించిన ఏటికొప్పాక బొమ్మ‌లు శ‌క‌టాల ప్ర‌ద‌ర్శనల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మూడో స్థానంలో నిల‌వ‌డం అభినంద‌నీమ‌య‌ని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మ‌న సంస్కృతి చాటే సంప్ర‌దాయ బొమ్మ‌ల‌కు జాతీయ స్థాయిలో పుర‌ష్కారం ద‌క్క‌డం సంతోషంగా ఉందన్నారు.

Similar News

News January 30, 2025

SKLM: రథసప్తమి పండగ .. టూరిజం బస్సు ఏర్పాటు

image

శ్రీ సూర్యనారాయణ స్వామి రాష్ట్ర పండగ రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో టూరిజం ప్యాకేజీలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. టూరిజం సంస్థ నేతృత్వంలో మినీబస్సు ఏర్పాటు చేశారన్నారు. శ్రీకూర్మం, మొగదలపాడు, సాలిహుండం, శ్రీముఖలింగం, రావివలస సర్క్యూట్ తిప్పిచూపిస్తారు. సన్‌రైజ్ హోటల్ రిసెప్షన్ వద్ద ఏపీ టూరిజం కౌంటర్ ఉందన్నారు. వ్యక్తికి రూ.750 ఉంటుందన్నారు.

News January 30, 2025

సిక్కోలు వాకిట.. జాతీ పిత మందిరం

image

శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ పార్క్‌లో మహాత్మాగాంధీ మందిరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనం ఉంది. ఇక్కడ ధాన్యముద్రలో ఉన్న గాంధీజీ విగ్రహం, మందిరం నాలుగువైపులా గాంధీ జీవితంలోని పలు ఘట్టాలను తెలియజేసేలా చిత్రాలు దర్శనమిస్తాయి. వనం చుట్టూ 40 మంది స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల విగ్రహాలను ఉంటాయి. 105 అడుగుల జాతీయ జెండా రెపరెపలాడుతూ పార్క్ మధ్యలో ఉంటుంది.

News January 30, 2025

SKLM: ఓట‌ర్లు 4829… పోలింగ్ కేంద్రాలు 31

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓట‌ర్ల జాబితా ప్ర‌కారం జిల్లా ప‌రిధిలో 4829 మంది ఓట‌ర్లు ఉన్నార‌ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. వారిలో పురుషులు 3275, కాగా మ‌హిళా ఓట‌ర్లు 1554 మంది ఉన్నార‌ని చెప్పారు. అర్హ‌త క‌లిగిన వారు నామినేష‌న్ ప్ర‌క్రియ ముగియ‌డానికి ప‌ది రోజుల ముందు వ‌ర‌కు అన‌గా జ‌న‌వ‌రి 31వ తేదీ సాయంత్రం 03.00 గంట‌ల వ‌ర‌కు ఓటు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు.