News August 14, 2025
SKLM: సందడిగా ప్రారంభమైన వజ్రోత్సవ ఫెయిర్, ఎగ్జిబిషన్లు

జిల్లా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా స్వర్ణ శ్రీకాకుళం ఫెయిర్, ఎగ్జిబిషన్ బుధవారం సాయంత్రం సందడిగా స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో ప్రారంభమైంది. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్ ఈ స్టాళ్లను ప్రారంభించారు. జిల్లాను ప్రతిబింబించే సాంప్రదాయ హస్తకళలు, ఆధునిక పరిశ్రమలు, వ్యవసాయ పరికరాలు స్టాల్స్‌ను వీరు పరిశీలించారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News August 14, 2025
శ్రీకాకుళం: ఒకే కాన్పులో రెండు దూడలు

శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామంలోని రామాలయం వీధిలో రైతు కృష్ణారావుకు చెందిన ఆవు ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చింది. గురువారం జరిగిన ఈ అరుదైన సంఘటనతో రైతు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రెండు దూడల్లో ఒకటి ఆడది, మరొకటి మగది అని రైతు తెలిపారు. తల్లి గోవు, 2 దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. గోవును దైవంగా భావించే తనకు ఈ విషయం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
News August 14, 2025
తిలారులో పెళ్లిరోజే మహిళ సూసైడ్

కోటబొమ్మాలి (M) తిలారుకు చెందిన వివాహిత లావణ్య (22) ఆత్మహత్యకు పాల్పడింది. నరసన్నపేటకు చెందిన పల్లి శ్రీనివాసరావు కుమార్తె లావణ్యను 2021 ఆగస్టు 14వ తేదీన సవర రాజారావుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే వివాహం జరిగిన నాటి నుంచి గొడవలు జరుగుతుండడంతో తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News August 14, 2025
పోలాకి: ఆక్వా రంగం అభివృద్ధిపై మంత్రి అచ్చెన్న సమీక్ష

మత్స్య, ఆక్వా రంగం అభివృద్ధిపై సంబంధిత అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఆక్వా కల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కావాలని, లైసెన్స్ జారీ ప్రక్రియ సులభతరం చేయాలని అధిరులకు ఆయన సూచించారు. రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా 5 లక్షలు టన్నులు చేపలు ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు.