News September 28, 2025

SKLM: సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టింగ్ పై ప్రత్యేక దృష్టి

image

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టింగులపై ప్రత్యేక దృష్టి సారించాలని రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. శనివారం ఎస్పీలతో వీడియో కాన్ఫ్‌రెన్స్ ఆయన నిర్వహించారు. మహిళలను అగౌరవ పరుస్తూ అభ్యంతరకరమైన పోస్టింగ్లు కొన్నిచోట్ల పెడుతున్నారని, అటువంటి పోస్టులను పరిశీలించేందుకు ప్రతి జిల్లాలో నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో SP కేవీ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.

Similar News

News September 28, 2025

కాలువల్లో మురుగు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

వర్షం నీరు నగర వీధుల్లో నిలిచిపోకుండా, కాలువల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన పట్టణంలోని సెవన్ రోడ్డు జంక్షన్‌, పాతబ్రిడ్జి, ముత్యాలమ్మ మార్కెట్‌ ప్రాంతాల్లో పర్యటించారు. కాలువలపై అక్రమ నిర్మాణాలు జరిపితే వాటిని పరిశీలించి తొలగించాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ఉన్నారు.

News September 28, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➡︎కవిటి: కూలిన చెట్టు.. తప్పిన ప్రమాదం
➡︎ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై దృష్టి: SP
➡︎ విద్యార్థులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మటామంతీ.
➡︎నరసన్నపేట: గడ్డి మందు తాగి ఒకరు మృతి
➡︎నందిగాంలో అమ్మవారికి 108 రకాల నైవేద్యం
➡︎వజ్రపుకొత్తూరు: పర్యావరణ రక్షణకు ప్రదర్శనలు.
➡︎కాశీబుగ్గ మేధరవీధిలో ఇళ్లలోకి మురుగునీరు
➡︎ఐటీడీఏ ఏర్పాటు చేయాలి: సీఎంకు పాతపట్నం ఎమ్మెల్యే వినతి

News September 27, 2025

నరసన్నపేట: గడ్డి మందు తాగి ఒకరు మృతి

image

నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన కెల్ల రాజారావు గడ్డి మందుతాగి శనివారం మరణించారు. కుటుంబ కలహాలు కారణంగా మనస్తాపం చెందిన రాజారావు 26న సాయంత్రం గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న రాజారావును కుటుంబ సభ్యులు నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌లో చేర్చగా అక్కడే చికిత్స పొందుతు మృతి చెందాడు. భార్య రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.