News January 25, 2026

SKLM: 10Th పాసైనా ఉద్యోగం

image

యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 27న ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి కే.సుధ శనివారం తెలిపారు. శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ వెనుక ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో ఎంపికలు ఉంటాయన్నారు. పేటీఎం సంస్థలో (10th పాస్‌తో) 55 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్ట్‌లు, సోలార్ ఎనర్జీలో (డిగ్రీతో) సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌లు ఉన్నాయన్నారు. అభ్యర్థులకు 18 ఏళ్ల వయసు నిండాలన్నారు.

Similar News

News January 31, 2026

SKLM: DSPగా డీసీఎంఎస్ ఛైర్మన్ భార్య

image

ఎచ్చెర్లలోని షేర్ మహమ్మద్ పురానికి చెందిన ఎస్. శివనాగ గౌరి గ్రూప్-1కు ఎంపికైంది. ప్రస్తుతం వంశధార జల వనరుల శాఖ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. భర్త చౌదరి అవినాశ్ శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె విజయం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News January 31, 2026

శ్రీకాకుళం: విద్యార్థులను చితకబాదిన టీచర్

image

నందిగాంలోని దేవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు శుక్రవారం విద్యార్థులపై తన ప్రతాపాన్ని చూపించారని తల్లిదండ్రులు ఆరోపించారు. హోమ్ వర్క్ రాయకుండా అల్లరి చేస్తున్నారనే కారణంతో ఒంటిపై వాతలు కనిపించేలా కర్రతో కొట్టారని మండిపడ్డారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

News January 30, 2026

శ్రీకాకుళం కలెక్టర్ సీరియస్

image

జగన్నాథ సాగర్ ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై కలెక్టర్ దినకర్ స్పందించారు. శుక్రవారం ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. చెరువు పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను జేసీబీలతో తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో 24 గంటల్లోగా ఆక్రమణలన్నీ తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి వివరించారు.