News November 13, 2024

SKLM: 14 నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రంధాలయ వారోత్సవాలు

image

శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే 57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల పోస్టర్, కరపత్రాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆవిష్కరించారు. బుధవారం కలెక్టర్ మందిరంలో గ్రంధాలయ వారోత్సవాలకు జిల్లా గ్రంధాలయ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20 వ తేదీ వరకు జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అని కలెక్టర్‌కు వివరించారు.

Similar News

News December 2, 2024

శ్రీకాకుళం: సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Tech కోర్సులకు సంబంధించిన 5, 7వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. ఈ మేరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30, పరీక్షా ఫీజు రూ.770, ప్రాక్టికల్ ఫీజు రూ.250తో కలిపి మొత్తం రూ.1,050 చెల్లించాలి. రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 5 వరకు, రూ.2,000 అపరాధ రుసుంతో 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

News December 2, 2024

పలు కోర్సుల పరీక్షల షెడ్యూల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ BR. అంబేద్కర్ యూనివర్సిటీలో పలు కోర్సులకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఈ సందర్భంగా బీటెక్ 5వ సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి, 7వ సెమిస్టర్ 13వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. అలాగే పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి బీపీఈడీ, డీపీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలు కూడా డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు.

News December 2, 2024

నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

image

కొత్త రేషన్ కార్డులకు నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ మేరకు అర్హుల నుంచి  సచివాలయ సిబ్బంది దరఖాస్తులను స్వీకరించనున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. వీరందరూ మార్పులు, చేర్పులు ఈ నెల 28లోపు చేసుకోవచ్చు. ఇప్పటికే కొత్త కార్డుల దరఖాస్తులు 12 వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో ప్రభుత్వం అర్హులందరికీ కొత్తకార్డులు మంజూరు చేయనుంది.