News October 8, 2024
SKLM: 2714 అభివృద్ధి పనులకు అనుమతులు- కలెక్టర్
రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంపై మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని పంచాయతీల పరిధిలో 3071 పనులు గుర్తించామని.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.249 కోట్లు అంచనా వేసినట్లు తెలిపారు. వీటిలో 2714 పనులకు అనుమతులు ఇచ్చామన్నారు.
Similar News
News November 8, 2024
SKL: ఆర్టీసీ బస్సు కిందపడి మూడేళ్ల బాలుడి మృతి
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కంచిలి మం. ముండల గ్రామంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కింద పడి మూడేళ్ల బాలుడు దివ్యాంశ్ ప్రధాన్ మృతి చెందాడు. కేబినౌగం నుంచి కంచిలి వస్తున్న ఆర్టీసీ బస్సు ముండల గ్రామాన్ని దాటుతున్న సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కిందపడ్డాడు. బాలుడి తండ్రి ఉపాధి కోసం ఇతర దేశంలో ఉండగా తల్లి సంగీత ఇద్దరు పిల్లలతో ఇంటి వద్దనే ఉంటున్నారు.
News November 8, 2024
ITEP 2వ సెమిస్టర్ టైం టేబుల్ విడుదల
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ఏయూలో పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి నాలుగో సంవత్సరం ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ITEP) 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
News November 8, 2024
కన్యాకుమారి వరకు సిక్కోలు కుర్రాడి సైకిల్ యాత్ర
శ్రీకాకుళం పట్టణానికి చెందిన యాగాటి ఉదయ్ అనే యువకుడు శ్రీకాకుళం నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేశాడు. యువత డ్రగ్స్‌కి బానిసలు కాకూడదని, ఆడవారిని గౌరవించాలనే నినాదంతో గత నెల15న సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈనెల 7న గురువారం నాటికి కన్యాకుమారికి చేరుకున్నారు. 1900 కిలోమీటర్ల సైకిల్ యాత్రను 22 రోజుల్లో పూర్తి చేశాడు. ఉదయ్‌కు తల్లిదండ్రులు, స్నేహితులు, పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు.