News April 29, 2024
SKLM: 30 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ

మే 13న జరిగే ఎలక్షన్‌కు సంబంధించిన ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. వచ్చేనెల ఏడవ తేదీలోగా పంపిణీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటరుకు ఈ స్లిప్పులు అందే విధంగా జిల్లా స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు బాధ్యతగా పనిచేయాలని కోరారు.
Similar News
News July 5, 2025
జిల్లాలో 75,556 బంగారు కుటుంబాలు గుర్తింపు: కలెక్టర్

జిల్లాలో 75,556 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. 181 కుటుంబాల్ని దత్తత తీసుకున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జులై 15లోగా మిగతా కుటుంబాలకు దత్తత లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు ముమ్మరం చేస్తామని అన్నారు. పాతపట్నంలో అత్యధికంగా నమోదయ్యారన్నారు.
News July 4, 2025
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

* నరసన్నపేట: టైర్ పేలి విద్యార్థుల ఆటో బోల్తా
* జిల్లాలో అల్లూరి జయంతి
* శ్రీకాకుళం, ఎల్.ఎన్ పేట, పొందూరు, రణస్థలంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు
* ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి
* హిరమండలం: నిండు కుండల వంశధార నది
* అక్రమ సంబంధం రెండు హత్యలకు దారితీసింది: డీఎస్పీ
* టెక్కలి: విద్యుత్ మీటర్ల సమస్యతో తల్లికి వందనం ఇబ్బందులు
* సారవకోట: అంగన్వాడీ కార్యకర్తల ధర్నా నోటీసు
News July 4, 2025
ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

ఆమదాలవలస ( శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదన రావు తెలిపారు. మృతుని వయసు 45 ఏళ్లు ఉండి, ఎర్రని బనియన్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9493474582 నంబరును సంప్రదించాలన్నారు.