News February 3, 2025
SKLM: 5 వరకు హెలికాప్టర్ రైడ్ పొడిగింపు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భక్తులను ఆకట్టుకోవడానికి హెలికాప్టర్ రైడ్ ప్రకటించారు. భక్తుల నుంచి వస్తున్న స్పందన, డిమాండ్ మేరకు ఈ రైడ్‌ను ఈనెల 5వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు డ్వామా పీడీ బి.సుధాకర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News November 23, 2025
ఈ అంబులెన్స్ ప్రజా సేవకు అంకితం: కలెక్టర్

కొత్తగా కొనుగోలు చేసిన ఆంబులెన్స్‌ను ప్రజాసేవకు అంకితం చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కొత్త ఆంబులెన్స్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఆంబులెన్స్ పాడైపోవడంతో ఆ సంస్థ ఛైర్మన్ జగన్మోహన్రావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త వాహనానికి రూ. 19.54 లక్షలు విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News November 22, 2025
మందస: లారీ ఢీకొని ఒకరు మృతి

లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మందస మండలం బాలిగాం బ్రిడ్జి సమీపాన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పలాస నుంచి ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై గుడ్లు లోడుతో వెళ్తున్న లారీ బాలిగాం బ్రిడ్జ్ సమీపాన బైక్‌ను ఢీకొంది. క్షతగాత్రుడికి తీవ్ర గాయలవ్వగా హరిపురం సీహెచ్‌సీకి తరలిస్తుండగా మరణించాడు. మృతుడు శాసనం గ్రామానికి చెందిన ధర్మారావు(45)గా సమాచారం. పోలీసు కేసు నమోదైంది.