News October 21, 2024

SKLM: DSC ఉచిత కోచింగ్ దరఖాస్తు గడువు పెంపు

image

త్వరలో వెలువడనున్న డీఎస్సీ 2024 పరీక్ష ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు గడువును ఈ నెల 25వరకు పొడిగించినట్లు ITDA PO యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు JnanaBhumi portalలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు.

Similar News

News July 9, 2025

హత్యాయత్నం కేసులో నిందితుడికి నాలుగేళ్లు జైలు: ఎస్పీ

image

మందస పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైన హత్యాయత్నం, గృహహింస కేసులో నిందితుడికి 4 ఏళ్లు జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. మందసకు చెందిన సూర్యారావు తన భార్య నిర్మలపై హత్యాయత్నం చేశాడు. నేరం రుజువైనందున అసిస్టెంట్ సెషన్ సోంపేట కోర్టు జడ్జి శిక్ష ఖరారు చేసినట్లు వివరించారు.

News July 9, 2025

రేపు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ డ్రైవ్

image

శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు, ఇంటెల్లిరేస్ సీఈఓ ఆర్. నరేంద్ర మంగళవారం తెలిపారు. ఈ మేళాలో పాల్గొనే వారు డిప్లొమా, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, బి.టెక్ విద్యార్హత ఉండాలన్నారు. 28 ఏళ్ల లోపు ఉన్న యువతి, యువకులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న యువత సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో మేళాలో పాల్గొనాలని కోరారు.

News July 9, 2025

ప్రతి ఉద్యోగి అయిదుగురుకైన ఆహ్వానం పలకాలి: జిల్లా కలెక్టర్

image

జూలై 10న మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ప్రతి ఉద్యోగి కనీసం ఐదు మంది తల్లిదండ్రులకైనా ఆహ్వానం పలికేందుకు ఇళ్లవద్దకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్, డిఆర్‌వో, ఇతర అధికారులతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు కోసం అరపూట సమయం వెచ్చించాలని, సమావేశాలకు భారీగా తరలి రావాలని ఆయన కోరారు.