News September 24, 2025
SKLM: RTCలో అప్రెంటిస్‌కు దరఖాస్తులు

ITI పాస్ అయిన అభ్యర్థులు RTCలో అప్రెంటిస్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 25లోగా డీజిల్, మెకానికల్, ట్రేడ్లలో ఉత్తీర్ణులైన వారు https://www.apprenticeshipindia.gov.on వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 10న విజయనగరం RTC ట్రైనింగ్ సెంటర్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
Similar News
News September 24, 2025
SKLM: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండటంతో రానున్న 4 రోజులు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 50కి.మీ వేగంతో గాలులు విస్తాయన్నారు. 08942-240557ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
News September 24, 2025
ఎచ్చెర్ల: ‘ఈ నెల 25 నుంచి అంబేడ్కర్ యూనివర్సిటీకి దసరా సెలవులు’

ఎచ్చెర్లలో గల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలకు ఈ నెల 25 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 9వ తేదీన తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సమాచారాన్ని కళాశాలల యాజమాన్యం, విద్యార్థులు గమనించాలని సూచించారు.
News September 23, 2025
పోలాకి: పిడుగుపడి మహిళ మృతి

పోలాకి మండలం ఉర్జాం గ్రామానికి చెందిన కణితి పద్మావతి (55) మంగళవారం పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పొలంలో గాబు తీస్తున్న సమయంలో సమీపంలో పిడుగు పడడంతో మృతి చెందిందని మృతురాలు భర్త కృష్ణారావు తెలిపారు. మృతురాలికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పద్మావతి మృతితో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.