News March 15, 2025
SKLM: ఈ నెల 16 నుండి 17 వరకు ఎపిపిఎస్సీ పరీక్షలు

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పగడ్బందిగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఈ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఫారెస్టు రేంజ్ అధికారి పరీక్షకు 546, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లకు 152 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షలు ఈ నెల 16 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.
Similar News
News March 17, 2025
జలుమూరు : ఖైదీలకు ఫోన్‌లు అందించిన దంపతులు అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా జలుమూరు పీఎస్ విధులు నిర్వహిస్తున్న భార్యాభర్తలను అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కారాగారంలో పని చేసిన ఫార్మాసిస్టు శ్రీనివాసరావుతో పాటు అతడి భార్య పుష్పలతను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. జైలులో ఉన్న నాగమల్లేశ్వరావు అనే ముద్దాయికి ఫోన్లు అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
News March 17, 2025
హరిపురంలో బ్యాటరీ వర్కర్ ఆత్మహత్య

మందస మండలం హరిపురం రైల్వే స్టేషన్ సమీపాన బీహార్‌కు చెందిన బ్యాటరీ వర్కర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన సోనూ కుమార్ సాహు (28) ఆదివారం మనస్తాపంతో గురై తన గదిలో గల దూలానికి నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారాన్ని మందస పోలీసులకు అందించారు. మందస ఎస్‌ఐ కె.కృష్ణ ప్రసాద్ వివరాలు సేకరిస్తున్నారు.
News March 16, 2025
శ్రీకాకుళం: గ్రీవెన్స్ సెల్ సమయం మార్పు

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ సమయాన్ని మార్చారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకే గ్రీవెన్స్ సెల్ ప్రారంభమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.