News October 28, 2024
SKLM: ఈ నెల 31న జిల్లాకు రానున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 31వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు సమాచారం వచ్చినట్లు ఆదివారం తెలిపారు. గురువారం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని సోంపేటలో ప్రారంభించనున్నారు. CM పర్యటన సభాస్థలిని పరిశీలించేందుకు MLA బెందాళం అశోక్, ఇన్‌ఛార్జి RDO కృష్ణమూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News December 18, 2024
అల్పపీడన ప్రభావం.. సిక్కోలుకు భారీ వర్షసూచన
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చలితీవ్రత అధికమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతాల్లో అలజడి మొదలవగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
News December 18, 2024
SKLM: రైతులు అప్రమత్తంగా ఉండాలి:జేసీ
నేటి నుంచి నాలుగు రోజుల వరకు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపిందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో వర్షంతో ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు ప్రతి మండలంలో 100 టార్పాలిన్లు మండల తహసీల్దార్ స్వాధీనంలో ఉంచామన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.
News December 17, 2024
శ్రీకాకుళం: పోలీసులపై దాడి.. నిందితుల అరెస్టు
శ్రీకాకుళం జిల్లా పోలీసులపై ఈ నెల 12వ తేదీ రాత్రి రాజమండ్రిలో కొంత మంది వ్యక్తులు దాడి చేసి ఒక కేసులో ముద్దాయి రాపాక ప్రభాకర్(ప్రతాప్ రెడ్డి)ని తీసుకువెళ్లిన ఘటన తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై దాడికి పాల్పడిన భీమవరం, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన 12 మందిని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు.