News December 27, 2024
SKLM: ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జవవరి 1 తేదికి సంబంధించిన పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1 వ తేది సెలవు దినం కావడంతో డిసెంబర్ 31న (మంగళవారం) పెన్షన్లు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 3,13,255 మంది లబ్ధిదారులకు రూ.128.56 కోట్లు అధికారులు ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు నగదు పంపిణీకి సిబ్బందితో కలిసి క్షేత్రా స్థాయిలోఅధికారులు చర్యలు చేపట్టారు.
Similar News
News December 28, 2024
శ్రీకాకుళం: నితీష్‌ను అభినందించిన మంత్రి అచ్చెన్న
భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అరుదైన రికార్డును అతి చిన్న వయసులో కైవసం చేసుకున్న విశాఖకు చెందిన నితీష్ నేటి యువ క్రీడాకారులకు ఆదర్శమని మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు కొనియాడారు. నితీష్ కుమార్ ప్రతిభకు, ఒత్తిడిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మనో ధైర్యానికి నిదర్శనమన్నారు. సోషల్ మీడియా వేదికగా ద్వారా శనివారం నితిష్‌ను అభినందించారు.
News December 28, 2024
SKLM: జనవరి 1 వేడుకలు .. ఎస్పీ కీలక సూచనలు
ఈ నెల 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి జిల్లా ప్రజలకు ఎస్పీ మహేశ్వర రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి బహిరంగ ప్రదేశాలలో రహదారులపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించరాదన్నారు. 31వ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ప్రజలు ఎవరూ రహదారులపై తిరగరాదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ బృందాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News December 28, 2024
SKLM: జనవరి 3న జడ్పీ స్థాయి సంఘ సమావేశం
జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు జనవరి 3న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి. శ్రీధర్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు కార్యలయం నుంచి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు 6వ స్థాయి, 11.30 గంటలకు 3వ స్థాయి, మధ్యాహ్నం 12.30 గంటలకు 5వ స్థాయి సంఘం సమావేశం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 2, 4, 1, 7 స్థాయి సంఘాల సమావేశాలు జరగనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.