News December 29, 2024
SKLM: కోనేరు హంపికి మంత్రి అచ్చెన్న అభినందనలు
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఘన విజయం సాధించిన కోనేరు హంపిని మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కార్యలయం ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. కోనేరు హంపి గెలుపు దేశానికి గర్వకారణమన్నారు. రెండోసారి ప్రపంచ టైటిల్ను సాధించిన ఆమె ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. మహిళలు హంపిను ఆదర్శంగా తీసుకోని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
Similar News
News January 4, 2025
రథసప్తమి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు:SKLM ఎస్పీ
రథసప్తమి వేడుకల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ఠంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన అరసవల్లిలో పర్యటించారు. అనంతరం పోలీసులు, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా ఎస్పీ ఆలయ భౌగోళిక మ్యాప్, దేవస్థానం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ, డీఎస్పీ వివేకానంద ఉన్నారు.
News January 3, 2025
SKLM: రేషన్ డీలర్ పోస్టుల ఖాళీల వివరాలు
శ్రీకాకుళం జిల్లాలో 107 రేషన్ డీలర్ల పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ మేరకు మండలాల వారీగా వివరాలను RDO కె. సాయి ప్రత్యూష శుక్రవారం ఆమె కార్యాలయం నుండి తెలియజేశారు. ఆమదాలవలస- 8, బూర్జ- 3, ఎచ్చెర్ల- 5, జి.సిగాడం- 5, జలుమూరు – 3, లావేరు – 15, నరసన్నపేట – 12, పోలాకి – 12, పొందూరు – 16, రణస్థలం – 10, సరుబుజ్జిలి – 4, శ్రీకాకుళం – 14 ఖాళీలు ఉన్నట్లు RDO స్పష్టం చేశారు.
News January 3, 2025
SKLM: రెవెన్యూ శాఖ క్యాలెండర్లను ఆవిష్కరించిన: కలెక్టర్
ఏపీజేఏసీ అమరావతి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్లను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రెవెన్యూ శాఖ అధికారులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష, ఏపీజేఏసీ నేతలు పాల్గొన్నారు.