News December 12, 2024

SKLM: చంద్రబాబు కృషి ఎంతో ఉంది: మంత్రి

image

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం హైదరాబాద్ శంషాబాద్లోని నోవాటెల్లో ఎయిర్ పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అప్పట్లో 5వేల ఎకరాల భూసేకరణ అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని తెలిపారు.

Similar News

News January 6, 2025

SKLM: జనవరి 8న పోలీస్ PET పరీక్షలు వాయిదా

image

శ్రీకాకుళం జిల్లాలో జనవరి 8న జరుగనున్న పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేసినట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు వివిధ శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 11న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. PET, PMT నోటిఫికేషన్ షెడ్యూల్ మేరకు జనవరి 8 తేది మినహా మిగిలిన తేదీల్లో PET పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. అభ్యర్థులు గమనించాలని ఎస్పీ స్పష్టం చేశారు.

News January 5, 2025

గార: ఉప్పు గెడ్డలో పడి వృద్ధురాలి మృతి

image

గార మండలం శ్రీకూర్మం పంచాయతీ జెల్లపేటకు చెందిన గండ్రేటి కృష్ణమ్మ (74) ప్రమాదవశాత్తు ఉప్పు గెడ్డలో జారి పడి మృతి చెందింది. శనివారం గార వెళ్తానని చెప్పిన కృష్ణమ్మ బందరువానిపేట వద్ద ఉన్న ఉప్పు గెడ్డలో పడి మరణించడంతో కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు.

News January 5, 2025

పాలవలసలో మొదలైన సంక్రాంతి సందడి

image

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలసలో గంగిరెద్దుల రాకతో సంక్రాంతి సందడి మొదలైంది. ‘అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అని ఎద్దుల బసవన్నలు ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. అందర్నీ దీవించి వాళ్ళు ఇచ్చిన పండగ కానుకలని స్వీకరిస్తూ వెళుతున్నారు. సన్నాయి చప్పుళ్ల నడుమ గంగిరెద్దుల నృత్యం చేశాయి. ప్రతీ ఏటా ఈ గంగిరెద్దులతో రాకతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటోంది.