News December 28, 2024

SKLM: జనవరి 1 వేడుకలు .. ఎస్పీ కీలక సూచనలు

image

ఈ నెల 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి జిల్లా ప్రజలకు ఎస్పీ మహేశ్వర రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి బహిరంగ ప్రదేశాలలో రహదారులపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించరాదన్నారు. 31వ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ప్రజలు ఎవరూ రహదారులపై తిరగరాదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ బృందాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News December 30, 2024

SKLM: ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన కలెక్టర్ 

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్లు భద్రపరిచే గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి సోమవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్‌లో పరిస్థితి అంతా సాధరణంగానే ఉందని జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.

News December 30, 2024

కంచిలి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కంచిలి జాతీయ రహదారి పక్కన పబ్జీ దాబా సమీపంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మండలంలోని బాసు బంజీరికి చెందిన బొండాడ రామారావు (45) విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం మేకల ఆహారానికి దాబా సమీపంలోని పొలానికి వెళ్లారు. చెట్టు కొమ్మలు కోస్తుండగా విద్యుత్ తీగ తగిలి కరెంట్ షాక్‌కు గురయ్యాడని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 30, 2024

సీతంపేట: వాటర్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి

image

సీతంపేట మండలం జొనగ గ్రామానికి చెందిన ఎస్.రాజయ్య చిన్న కుమారుడు ఎస్.పవన్ కుమార్ (5) బాలుడు ఆడుకుంటూ వాటర్ ట్యాంక్‌లో పడి మరణించాడు. ఈ ఘటన  సోమవారం ఉదయం చోటుచేసుకుంది. నీటి ట్యాంక్‌లో పడిన బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.