News December 24, 2024

SKLM: నేటి నుంచి సెలవులు

image

శ్రీకాకుళం జిల్లాలోని డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర కాలేజీల సెలవుల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం ఈనెల 24  నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రిస్మస్ సెలవులని వర్శిటీ రిజిస్ట్రార్ పి.సుజాత తెలిపారు. అలాగే  జనవరి 10వ తేదీ నుంచి అదే నెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులని.. తిరిగి కళాశాలలు జనవరి 20న రీఓపెన్ చేయాలని ఆదేశించారు. 

Similar News

News December 25, 2024

‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ మూవీ రివ్యూ

image

ఉత్తరాంధ్ర నేపథ్యంలో వెన్నెల కిశోర్ నటించిన ‘శ్రీకాకుళం షేర్లాక్‌హోమ్స్’ సినిమా నేడు రిలీజైంది. భీమిలి బీచ్‌లో హత్యకు గురైన ఓ మహిళ కేసు ప్రైవేట్ డిటెక్టివ్ హీరో వెన్నెల కిషోర్‌ చేతికి ఎలా వచ్చింది? ఆయన కేసును ఎలా చేధించారనేది కథాంశం. కాగా హీరో పాత్ర బలంగా లేకపోవడం, థ్రిల్లింగ్ అంశాలు కొరవడటం సినిమాకు మైనస్. కొన్ని ట్విస్టెడ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. మూవీపై మీ కామెంట్.

News December 25, 2024

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో శిశువు మృతి

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో బుధవారం వేకువజామున మగ శిశువు మృతిచెందాడు. నందిగాం మండలం కైజోల గ్రామానికి చెందిన శ్రావణి డెలివరీకి అడ్మిట్ అయ్యారు. బుధవారం వేకువజామున పురిటినొప్పులు అధికం కావడంతో సాధారణ కాన్పులో బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే అస్వస్థతకు గురైన శిశువు కొద్దిసేపటికి మృతిచెందింది. శిశువు మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణమని బంధువులు ఆసుపత్రిలో నిరసన తెలిపారు.

News December 25, 2024

SKLM: క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా క్రైస్తవ సోదర, సోదరీమణులకు జిల్లా ఎస్పీ  కెవి మహేశ్వర రెడ్డి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించి క్రిస్మస్ పండగ జరుపుకోనున్న ప్రతి ఒక్కరుకి జిల్లా ఎస్పీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండగ వేళ ప్రతి ఒకరు జీవితంలో వెలుగులు రావాలని చెప్పారు. దేవుడు మీ పట్ల దయ చూపాలని పేర్కొన్నారు.