News November 17, 2024
SKLM: బ్యాంకులు భద్రత ప్రమాణాలు పాటించాలి: ఎస్పీ
బ్యాంకు సముదాయాలు, బ్యాంకులు, నగదు లావదేవీలు జరిగే (ATM) కేంద్రాలు వద్ద భద్రత ప్రమాణాలు పాటిస్తూ, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి బ్యాంకు అధికారులను సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి బ్యాంకు ప్రవేశ ద్వారం దగ్గర నియమించిన గార్డు అప్రమత్తంగా ఉండాలని, ఆయనకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
Similar News
News November 16, 2024
పలాస: ఉరేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి
పలాస మండలం ఈదురాపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శాసనపురి నవ్య(30) శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు కాశీబుగ్గ సూదికొండ ప్రాంతంలోని ప్రభత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనపై కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
News November 16, 2024
పైడి భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికలు వివరాల ప్రకారం.. బైక్-లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే పనిలో స్థానికులు ఉన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
News November 16, 2024
సీదిరి అప్పలరాజుకి కీలక బాధ్యతలు
ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, శ్యామ్ ప్రసాద్‌కి బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌తో అండగా ఉంటూ క్యాడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.