News April 5, 2025

SKLM: మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

మెగా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ, ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ) అభ్యర్థులకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ శ్రీకాకుళం ఉచిత ఆన్‌లైన్ శిక్షణను అందించనున్నట్లు సంస్థ సంచాలకులు ఈ.అనురాధ తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Similar News

News April 6, 2025

 మంత్రిఅచ్చెన్నకు కాంట్రాక్ట్ ఉద్యోగుల వినతి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ కాంట్రాక్ట్ ఉద్యోగులు శనివారం రాత్రి నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో కలిశారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కేవలం రూ. 17 వేలను మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలకు గౌరవ వేతనం చాలడం లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు.  

News April 5, 2025

శ్రీకాకుళం జిల్లాకు పిడుగుల ముప్పు

image

ప్రస్తుతం తుపాన్ ప్రభావం లేనప్పటికీ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. శనివారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.

News April 5, 2025

వజ్రపుకొత్తూరు: బాతుపురంలో నెమళ్ల సందడి

image

వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో శుక్రవారం నెమళ్లు సందడి చేశాయి. గ్రామం సమీపంలోని కొండల ప్రాంతం నుంచి నెమళ్లు గ్రామానికి చేరుకుని గ్రామంలోని చెట్లపై కనిపిస్తూ కనువిందు చేశాయి. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన నెమళ్లు జనావాసాల్లోకి వస్తుండటంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా నెమళ్లు రాక గ్రామస్థులకు ఆహ్లాదాన్ని ఇచ్చింది.

error: Content is protected !!