News January 21, 2025

SKLM: రథసప్తమి వేడుకలకు కార్యక్రమాలు ఇవే..!

image

రథసప్తమి వేడుకల్లో తొలి రోజు 80 ఫీట్ రోడ్డు వద్ద ఉదయం సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమవుతాయి. అనంతరం మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్, కర్రసాముతో పాటుగా పలు పోటీలు జరుగుతాయి. ఏడు రోడ్ల నుంచి అరసవల్లి ఆలయం వరకు ఘనంగా శోభయాత్ర ఉంటుంది. 80 అడుగుల రోడ్డు వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 9.30 గంటలకు అక్కడే అద్భుతమైన లేజర్ షో, రాత్రికి డచ్ బిల్డింగ్ వద్ద క్రాకర్స్ షో ఉంటుంది.

Similar News

News January 22, 2025

నేర నియంత్రణకు పటిష్ట చర్యలు: ఎస్పీ

image

ప్రతి పోలీసు అధికారి అంకితభావంతో విధులు నిర్వర్తించి 2025 ఏడాదిలో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లాలో ఉన్న పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, మహిళలు చిన్నారులపై జరిగేనేరాలు, సైబర్ నేరాలు, గ్రేవ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలు, తదితర కేసులపై సమీక్షించారు.

News January 21, 2025

శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సిరిపురపు 

image

శ్రీకాకుళం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుని ఎన్నికల ప్రక్రియ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. పార్టీ నూతన అధ్యక్షులుగా సిరిపురపు రాజేశ్వరరావు పేరును బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెయిల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ రాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, సుహాసిని ఆనంద్, పూడి తిరుపతి రావు, తదితరులు హాజరయ్యారు.

News January 21, 2025

శ్రీకాకుళం: ఈ నెల 24న సుకన్య సమృద్ధి యోజన డ్రైవ్

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్నిపోస్ట్ ఆఫీస్‌లలో జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 24వ తేదీన సుకన్య సమృద్ధియోజన మెగా మేళా నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు తెలిపారు. 10 సంవత్సరాలోపు బాలికలు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు. ఒక సం.లో కనీసం 250/- గరిష్ఠంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. బాలికకు 18సం. నిండిన తర్వాత విద్య, వివాహం నిమిత్తం 50% వరకు నగదును ఉపసంహరించుకోవచ్చని తెలిపారు.