News February 2, 2025

SKLM: సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభం

image

అర‌స‌వ‌ల్లి శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామి ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు ఆదివారం ఉదయం సూర్య నమస్కారాలతో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణ, సూచనల మేరకు శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సుమారు 5000 మందితో ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. 12 రకాల ఆసనాలు వివరిస్తూ అందరితో చేయించారు. సూర్య నమస్కారం రెగ్యులర్ అభ్యాసం మెరుగైన మానసిక స్పష్టత వస్తుందన్నారు.

Similar News

News February 2, 2025

పాలకొండ: ఇంటర్ విద్యార్థి మృతి

image

హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన పాలకొండలోని ఓ ఇంటర్ కళాశాలలో జరిగింది. ఎస్ఐ ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.నిఖిల్ కళాశాల పైనుంచి శుక్రవారం పడి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 2, 2025

సంతబొమ్మాళి: ఈ మర్రి వృక్షానికి వందల ఏళ్లు..!

image

సంతబొమ్మాళి మండలం గోవింధాపురం పంచాయితిలో ఉన్న కోటబొమ్మాళి రైల్వే స్టేషన్(గ్రామంలో )వద్ద ఉన్న ఈ మర్రి చెట్టుకు ఎన్ని ఏళ్లో తెలియదు. రెండు వందల ఏళ్లు కిందట ఈ చెట్టు ఉన్నట్లు మా ముందు తరం వారు చెప్పారని స్థానికులు చెబుతున్నారు. ఈ వృక్షం పైకొమ్మలు నుంచి ఊడలు (వేర్లు) భూమిలోకి పాతుకుపోయాయి. చెట్టు చుట్టూ వరండా కట్టారు. వేశవి కాలంలో సేద తీర్చుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందనీ స్థానికులు అంటున్నారు.

News February 2, 2025

SKLM: రథసప్తమికి దర్శన టికెట్ల ఇచ్చే ప్రదేశాలు ఇవే .!

image

రథసప్తమి సందర్భంగా దర్శన టికెట్లను అందుబాటులో ఉంచామని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. రూ.100 దర్శన టికెట్లు: అరసవల్లి దేవాలయ ప్రాంగణంలోని కౌంటర్‌లో లభిస్తాయి. అరసవల్లి దేవాలయ ప్రాంగణంలోని కౌంటర్‌లోనే రూ.100 దర్శన టికెట్లు, రూ.300 దర్శన టికెట్లు, రూ. 500 క్షీరాభిషేకం టికెట్లు(ఇద్దరికి దర్శన అవకాశం) లభించనున్నాయన్నారు