News February 1, 2025
SKLMలో హెలికాప్టర్ టూరిజం
తొలిసారిగా హెలికాప్టర్ టూరిజం జిల్లాలో అందుబాటులోకి తెచ్చారు. రథసప్తమి వేడుకలు సందర్భంగా ఈ హెలికాప్టర్ టూరిజం జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో ఆదివారం, సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డచ్ బిల్డింగ్, కలెక్టరేట్ దగ్గర హెలికాప్టర్ రైడ్‌ను ఏర్పాటు చేశారు. రూ.1800తో 8 నిమిషాలపాటు రైడ్ ఉంటుందని అధికారులు తెలిపారు.
Similar News
News February 2, 2025
SKLM: హెలికాప్టర్ రైడ్‌కి టిక్కెట్ ఇలా బుక్ చేసుకోండి.!
శ్రీకాకుళం పట్టణంలోని “డచ్” భవనం ప్రాంగణంలో హెలికాప్టర్ ద్వారా విహరించే విషయం తెలిసిందే. ఈ మేరకు టిక్కెట్ రూ. రూ.1800లుగా వుంటుంది. 2 సంవత్సరాల వయసు లోపల గల పిల్లలకు ప్రవేశం లేదు. సదరు హెలికాప్టర్ ద్వారా విహరించు టికెట్స్ ఆన్ లైన్ తో పాటుగా శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ వారి కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. వెబ్సైట్ https://heliride.arasavallisungod.org/ లో టికెట్ చేసుకోవచ్చు.
News February 1, 2025
విధులపై అవగాహన కలిగి ఉండాలి: SKLM ఎస్పీ
శ్రీకాకుళం పట్టణంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఆదిత్యుని రథసప్తమి వేడుకలు బందోబస్తు విధులపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో రథసప్తమి వేడుకల బందోబస్తుకు సంబంధించి బందోబస్తు, ట్రాఫిక్, వాహనాల పార్కింగ్, భక్తుల దర్శనం, ట్రాఫిక్ మళ్లింపు తదితర అంశాలపై సెక్టార్ వారీగా పోలీసు అధికారులతో సమీక్షించారు.
News February 1, 2025
డీజీపీని కలిసిన శ్రీకాకుళం ఎస్పీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన్ను మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని శాంతిభద్రతలకు తీసుకున్న చర్యలను ఎస్పీ డీజీపీకి తెలియజేశారు.