News February 20, 2025
మార్చి 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎస్కేఎం ధర్నాలు

TG: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 5-13 వరకు జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని ఎస్కేఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని ఆరోపించింది. విద్యుత్ సవరణ బిల్లు విషయంలోనూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిందని దుయ్యబట్టింది. ఈ ఆందోళనల్లో రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు భాగస్వామ్యం కావాలని కోరింది.
Similar News
News November 23, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.oil-india.com/
News November 23, 2025
మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు

మిరియాలు ప్రతి వంటింట్లో కచ్చితంగా ఉంటాయి. వీటివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడం, క్యాన్సర్ నివారణ, డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంచడం, గుండె ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అయితే కడుపులో మంట ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.
News November 23, 2025
28న 25 బ్యాంకులకు శంకుస్థాపన

AP: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అక్కడ ఒకేసారి 25 బ్యాంకు భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అక్కడ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే CRDA బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. బ్యాంకుల ఏర్పాటుతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.


