News November 23, 2024
SKU బ్యాడ్మింటన్ జట్టు ఇదే..!
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అంతర కళాశాలల బ్యాడ్మింటన్ జట్టు ప్రకటించారు. ఇందులో జాహ్నవి(వాణి డిగ్రీ కళాశాల), తన్మయి (SSGS డిగ్రీ కళాశాల గుంతకల్), సమీరా (SSBN డిగ్రీ కళాశాల) ఉన్నారు. ఈ జట్టు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ, జట్లతో తలపడనుంది. విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ బెల్గావ్ యూనివర్సిటీ లో 26 నుంచి 28 వరకు పోటీలు జరగుతాయని రిజిస్టార్ రమేశ్ బాబు తెలిపారు.
Similar News
News December 14, 2024
అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు, దాడులు,ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలను ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం వెల్లడించారు. పేకాట, మట్కా, తదితర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎం.వి కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై మోటారు వాహనాల చట్ట ప్రకారంగా 707 కేసులు నమోదు చేశారు. రూ. 1,72,816/- లు ఫైన్స్ వేశారు.
News December 13, 2024
అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు: MLA కాల్వ
అనంతపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ రాయదుర్గం MLA కాల్వ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు అని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు రైతాంగానికి, సాగునీటి రంగానికి ఏమీ చేయకుండా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.
News December 13, 2024
పెనుకొండ బాబయ్య స్వామి చరిత్ర.. (1/1)
పెనుకొండ బాబయ్య స్వామి 752వ గంధం, ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా బాబా ఫకృద్దీన్ జన్మస్థలం ఇరాన్ దేశం. చక్రవర్తిగా రాజ్యపాలన చేస్తున్న సమయంలో చేసిన తప్పునకు పశ్చాత్తాపంతో గురువుల ఆదేశానుసారం ఇరాన్‌ను వీడుతారు. దేశాలన్నీ తిరుగుతూ తమిళనాడులోని తిరుచనాపల్లికి చేరతారు. అక్కడ సత్తేహార్ తబ్రే ఆలం బాద్‌షాను గురువుగా పొందుతారు. ఆయన వేపపుల్ల ఇచ్చి పెనుకొండకు వెళ్లమని బాబాను ఆదేశిస్తారట. <<14864905>>Cont’d..<<>>