News March 26, 2024

హైదరాబాద్‌తో మ్యాచ్‌కూ SKY దూరం

image

గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యారు. ఆయనకు ఇంకా NCA నుంచి NOC లభించలేదు. దీంతో ఈ మ్యాచ్‌కు కూడా సూర్య అందుబాటులో ఉండడం లేదు. కాగా ఇటీవలే SKY పలు సర్జరీలు చేయించుకున్నారు. అనంతరం NCAలో పునరావాసం పొందుతున్నారు. NCA అనుమతిస్తేనే సూర్య IPLలో ఆడతారు.

Similar News

News February 2, 2026

ఒక్క నిర్ణయంతో ₹10 లక్షల కోట్ల నష్టం.. కానీ మన మంచికే!

image

బడ్జెట్లో డెరివేటివ్స్‌పై సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ టాక్స్ (STT) పెంచడంపై CEA వి.అనంత నాగేశ్వరన్ క్లారిటీ ఇచ్చారు. F&O ట్రేడింగ్‌లో జనం భారీగా డబ్బు పోగొట్టుకుంటున్నట్లు SEBI రిపోర్ట్స్ చెబుతున్నాయని, ఈ స్పెక్యులేటివ్ బెట్స్‌ను అరికట్టి హౌస్‌హోల్డ్ సేవింగ్స్‌ని కాపాడడమే తమ ఉద్దేశమని వివరించారు. STT పెంపుతో నిన్న స్టాక్ మార్కెట్లు కుప్పకూలి ఇన్వెస్టర్లు దాదాపు ₹10 లక్షల కోట్ల మేర నష్టపోయారు.

News February 2, 2026

HLL లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌లో 39 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ 39 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుకు జనవరి 28 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 8 వరకు పొడిగించారు. పోస్టును బట్టి BSc, BTech, CA, MSc, MBA/PGDM, MCA, MHA, MPH, BPMT, PGDMLT, MLT అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.20,000-రూ.2,20,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com

News February 2, 2026

మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలతో మేలు

image

☛ సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ☛ ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. ☛ తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. ☛ మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. ☛ మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. ☛ చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.