News July 19, 2024
SKY: 30 ఏళ్లకు ఎంట్రీ.. 33 ఏళ్లకు కెప్టెన్

సూర్య కుమార్ టీ20 క్రికెట్లో ఓ సంచలనం. 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్కై ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఏడాది వ్యవధిలో సెంచరీ బాది మరుసటి సంవత్సరమే నం.1 ర్యాంకుకు చేరారు. ఆ తర్వాత వరుసగా రెండు సార్లు T20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. ఈ ఫార్మాట్‌కు రోహిత్ గుడ్ బై చెప్పడంతో తాజా శ్రీలంక టూర్‌కు కెప్టెన్‌గా ఎంపికై శాశ్వత సారథిగా ఉండే అవకాశాలను మెరుగుపరుచుకున్నారు.
Similar News
News December 3, 2025
విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు: CBN

AP: విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని CM చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి పెన్నా వరకు తీసుకెళ్తామన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ సేవలు ప్రారంభించామని చెప్పారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని తూ.గో జిల్లా నల్లజర్లలో జరిగిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో తెలిపారు.
News December 3, 2025
ఆయిలీ స్కిన్ కోసం ఈ మేకప్ టిప్స్

మేకప్ బాగా రావాలంటే స్కిన్టైప్ని బట్టి టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. ఆయిల్ స్కిన్ ఉన్నవారు లైట్ మాయిశ్చరైజర్, సిలికాన్ బేస్డ్ ప్రైమర్ వాడాలి. ఇది ఆయిల్ ఉత్పత్తిని తగ్గించి బ్లర్ టూల్‌గా పనిచేస్తుంది. రంధ్రాలు, ఫైన్ లైన్స్ కవర్ చేస్తుంది. బేస్ కోసం మ్యాట్, తేలికైన, ఎక్కువసేపు ఉండే ఫౌండేషన్‌ను ఉపయోగించాలి. తేలికపాటి పౌడర్ బ్లష్, కాంటౌర్, హైలైటర్ ఉపయోగిస్తే మంచి లుక్ ఉంటుందంటున్నారు.
News December 3, 2025
డాలర్ విలువ పెరిగితే మనకు ఎలా భారం..?

డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం సామాన్యుడికి ఆర్థిక భారం. ఫారిన్ దిగుమతులకు డాలర్ రూపంలో డబ్బు చెల్లించాలి. దీంతో మనం ఎక్కువ పే చేయాలి. 90% క్రూడ్, కొన్ని వంట నూనెలు విదేశాల నుంచే వస్తాయి. సెమీ కండక్టర్స్, చిప్స్ లాంటి ఇంపోర్టెడ్ విడి భాగాలతో తయారయ్యే ఫోన్స్, ల్యాప్టాప్స్, రిఫ్రిజిరేటర్స్ ధరలు, ఫారిన్లో మన విద్యార్థులకు పంపాల్సిన ఫీజులు పెరుగుతాయి.
Ex: ఓ $1 వస్తువు.. మనకు గతంలో ₹80, నేడు ₹90.


